Chintoor: పంచాయతీ నిర్లక్ష్యం.. మురుగు కాలువలు శుభ్రం చేస్తున్న కారం వాసు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ఎస్టీ కాలనీలో 20 ఏళ్లుగా పూడుకుపోయిన మురుగు కాలువలను పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో పీసా కమిటీ సభ్యుడు కారం వాసు స్వయంగా శుభ్రం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 13 Nov 2026 2:28 PM IST
Chintoor
X

Chintoor: పంచాయతీ నిర్లక్ష్యం.. మురుగు కాలువలు శుభ్రం చేస్తున్న కారం వాసు!

చింతూరు: చింతూరు మండలం ఎస్టీ కాలనీలో గత 15 నుండి 20 ఏళ్లుగా పూడుకుపోయిన మురుగు కాలవలను పిసా కమిటీ సభ్యులు కారం వాసు స్వయంగా శుభ్రం చేస్తున్నారు.మురుగు నీరు పోవడానికి మార్గం లేక నిలిచిపోవడంతో దోమలు విజృంభించి, వ్యాధులు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా రోజులు గడుస్తున్నా స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చివరకు పిసా కమిటీ సభ్యులు కారం వాసు స్వయంగా రంగంలోకి దిగి కాలవలను శుభ్రం చేయడం ప్రారంభించారు. వెంటనే కాలవలను పూర్తిగా శుభ్రం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR