Chintoor: అర్ధరాత్రి చీకట్లో మూగజీవాల ఆర్తనాదం.. ఆగని గో మాఫియా!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలో అర్ధరాత్రి చీకటిని అడ్డుపెట్టుకుని గో మాఫియా మూగజీవాలను వాహనాల్లో కుక్కి అక్రమంగా తరలిస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Chintoor: అర్ధరాత్రి చీకట్లో మూగజీవాల ఆర్తనాదం.. ఆగని గో మాఫియా!
చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలంలో మూగజీవాల అక్రమ తరలింపు ఆగడం లేదు. రాత్రి పొద్దుపోయాక, అందరూ నిద్రలోకి జారుకున్న వేళ... గో మాఫియా రెచ్చిపోతోంది. చీకటిని అడ్డుపెట్టుకుని మూగజీవాలను వాహనాల్లో కుక్కి తరలిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతోంది.పట్టించుకునే నాథుడే లేకపోవడంతో మాఫియా ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి.
"మేం చెప్పిందే వేదం, మేం చేసిందే చట్టం" అన్నట్లుగా విర్రవీగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొత్తపల్లి, వేములరాయి, నేలకోట ప్రాంతాల్లోని కొందరు స్థానికులు ఈ గో మాఫియాకు అండదండలు అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. దీంతో మాఫియాకు మరింత ధైర్యం పెరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మూగజీవాల కళ్లలోని భయం, వాటి ఆర్తనాదాలు చూసి కూడా చలించని ఈ ముఠాపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ అక్రమ దందా మరింత పెరిగి గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, సంబంధిత అధికారులు కళ్లు తెరిచి, రాత్రిపూట గట్టి నిఘా పెట్టి ఈ గో మాఫియా ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.




