Chintoor: ముకునూరులో హీటెక్కిన సర్పంచ్ పోరు.. పాయం నాగరాజు దూకుడు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. జనసేన మద్దతు అభ్యర్థి పాయం నాగరాజు ఇంటింటి ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Chintoor: ముకునూరులో హీటెక్కిన సర్పంచ్ పోరు.. పాయం నాగరాజు దూకుడు!
చింతూరు: ముకునూరులో సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారింది. జనసేన మద్దతుతో బరిలో దిగిన పాయం నాగరాజు ప్రచారంతో గ్రామం మొత్తం షేక్ అవుతోంది. "ఒకే ఒక్కసారి... ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు! సమస్యల ఊబిలో కూరుకుపోయిన మన ముకునూరును బయటకు లాగుతా!" అంటూ నాగరాజు చేస్తున్న ప్రతి మాట ఓటర్ల గుండెల్లో గుచ్చుకుంటోంది.
ఇంటింటా తిరుగుతూ, ప్రతి ఓటర్ని పలకరిస్తూ నాగరాజు చేస్తున్న దూకుడు ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు.ఎక్కడ చూసినా "నాగరాజుకే మా ఓటు" అనే మాటే వినిపిస్తోంది.దీంతో ప్రత్యర్థి శిబిరంలో గుబులు మొదలైంది. నాగరాజు దూసుకుపోతున్న వేగానికి వారు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.




