Chintoor: ముకునూరులో మార్మోగుతున్న పేరు పాయం నాగరాజు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ముకునూరు పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన యువకుడు పాయం నాగరాజు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Chintoor: ముకునూరులో మార్మోగుతున్న పేరు పాయం నాగరాజు!
చింతూరు: ముకునూరు పంచాయతీలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఒక్కటే పేరు. పాయం నాగరాజు.జనసేన మద్దతుతో సర్పంచ్ బరిలోకి దిగిన ఈ యువకుడు. వీధి వీధినా తిరుగుతూ ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. పెద్దల ఆశీర్వాదం, యువత అండ, మహిళల అభిమానం. అన్నీ నాగరాజు వైపే.జనసైనికులు సైతం ఊరంతా జెండాలతో, నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ఈసారి మనోడే గెలవాలి అన్నదే ఊరి మాట. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి... అందుకే ఓటర్లు సైతం నాగరాజును గెలిపించుకుందాం అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ముకునూరు పంచాయతీలో ఇప్పుడు గెలుపు దిశ ఒక్కటే... నాగరాజు వైపే.




