Poduru: కుల వివక్ష, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

Poduru: పోడూరు మండలం తూర్పుపాలెంలో తమ కుటుంబంపై అగ్రవర్ణాల వారు కుల వివక్షతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాలం శ్రీనివాస్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 3 Oct 2026 8:52 PM IST
Poduru
X

Poduru: కుల వివక్ష, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు

పోడూరు: పోడూరు మండలం తూర్పుపాలెం గ్రామ పంచాయతీ గ్రామంలో శెట్టి బలిజి సామజ వర్గానికి చెందిన బాలం శ్రీనివాస్ కుటుంబ ఆవేదన.

అగ్రవర్ణాల వారి కులంకారంతో మా కుటుంబాలపై కుల వివక్షతో కక్ష సాధింపు చర్యలకుపాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ ఇంటి ఎదురుగా రహదారి నిర్మాణానికి స్థలాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. గతంలో తహసిల్దార్ సమక్షంలో సర్వే నిర్వహించి రహదారి కోసం ఎనిమిది అడుగుల స్థలం వదిలినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం మరో ఆరు అడుగులు కలిపి 14 అడుగుల వెడల్పున రహదారి నిర్మాణానికి మట్టి తవ్వారని తెలిపారు. చివరి వరకు ఉన్నది పోరంబోకు స్థలమైతే, అక్కడ నిర్మించిన ఇళ్లను కూడా నిబంధనల ప్రకారం తొలగించాలని కోరారు. చుట్టుపక్కల వారు దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పందించి సమగ్రంగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA