Rajanagaram: రాజానగరంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Rajanagaram: రాజమహేంద్రవరం రాజానగరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ ఆకుల శ్రీధర్.
Rajanagaram: రాజానగరంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు!
Rajanagaram: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్బంగా గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో ఘనంగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ జిల్లా ఇన్‌చార్జి ఆకుల శ్రీధర్, యువ మోర్చా జిల్లా ఇంచార్జ్ మాదేపల్లి కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయారు.
ఆకుల శ్రీధర్, కంబాల శ్రీనివాసరావు, కళ్యాణ్ కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కంబాల శ్రీనివాసరావు, కళ్యాణ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శిఖరం పాల్గొని, రక్తదానం చేశారు. మీడియా సమావేశం ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా కంబాల శ్రీనివాసరావు గోకవరం సీఎండీ లే అవుట్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయంమన్నారు.
ఆయన పిలుపు మేరకు అభిమానులు కార్యకర్తలు నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్ని రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. మూడు నియోజకవర్గంల్లో కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకోని, కంబాల శ్రీనివాసరావు చేసిన సేవ కార్యక్రమాలను అభినందించారు. నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంట్లో దీపాన్ని వెలిగించి, ఆయనకు ఆశీర్వాదం అందించాలని అన్నారు.
అనంతరం కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన డోనర్స్ కి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.




