Rajahmundry: రాజమండ్రిలో అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ!
Rajahmundry: రాజమండ్రి జిత్ కళావేదికలో అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం. ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ సోమరాజు నాయుడుకి సత్కారం, ఫిజియోథెరపీ కిట్ల పంపిణీ.
Rajahmundry: రాజమండ్రిలో అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ!
Rajahmundry: అమ్మ ఫిజియోథెరపీ అండ్ ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్బంగా ఆదివారం సాయంత్రం స్థానిక జిత్ మోహన్ మోహన్ మిత్ర కళావేదికలో ఫిజియో థెరపి కిట్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నట గాయకుడు ఆర్కెస్ట్రా పితామహుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్ర హాజరవగా, ముద్రగడ ఏసుబాబు జ్యోతి ప్రకాశనం చేశారు. నూజిళ్ల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించగా అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమరాజు నాయుడు పెషేంట్స్ కి చేస్తున్న ఉచిత సేవలను వి.జగపతి, పివి ఎస్ కృష్ణారావు డి.యస్.శ్రీనివాస్, పిచ్చుక మహేష్, ఉప్పులూరి చిన్నారావు, సుక్కురెడ్డి శ్రీనివాసరావు,బి.సీతారామారావు సి.హెచ్.విశ్వనాధ్, బి.హెచ్.రామకృష్ణ కొనియాడారు.
ఈసందర్భంగా శ్రీ పాద జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా అమ్మ ఫిజియోథెరపీ హాస్పిటల్ సంస్థను నిర్వహిస్తూ, పేదలకు ఉచిత సేవలు అందిస్తూ డా.నాయుడు ఉత్తమ వైద్యుడిగా పేరు పొందారని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎటువంటి లాభా పేక్ష లేకుండా పేదలకు 50 శాతం ఖర్చులకు వైద్యం , వికలాంగులైన చిన్న పిల్లలకు ఉచిత వైద్యం, వైద్య శిబిరాల ద్వారా మారుమూల పల్లెల్లో అవగాహన సదస్సులు, ఉచిత సేవలు అందిస్తూ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ సోమరాజు నాయుడు కృషి అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా జిత్ మోహన్ మిత్ర బృంద సభ్యులు గోదావరి మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ జీమా సభ్యులు డాక్టర్ నాయుడుకి జ్ఞాపిక అందించి అభినందన సత్కారం చేశారు. ముందుగా సంగీత విభావరి జరిగింది. హేమా నళిని, ఎం సూర్య కుమారి, గుంటూరి శ్రీనివాసరావు, కృష్ణ శర్మ,హరి, పోస్టల్ ప్రసాద్, దేశిరెడ్డి బలరామ నాయుడు, సూర్య సిద్ధాంతి, తదితరులు పాల్గొన్నారు.




