Chintoor: పోలవరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి... డిసెంబర్ 2న 3వ విడత పోలింగ్!

Chintoor: పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఏటపాక మండలాల్లో డిసెంబర్ 2న 3వ విడత పంచాయతీ పోలింగ్. ఏర్పాట్లను వివరించిన కలెక్టర్ కె. దినేష్ కుమార్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 9 Nov 2026 6:41 PM IST
Chintoor
X

Chintoor: పోలవరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి... డిసెంబర్ 2న 3వ విడత పోలింగ్!

చింతూరు: పోలవరం జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు - 2026లో భాగంగా గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మూడవ విడతలో భాగంగా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఏటపాక మండలాల్లో డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన వంటి కార్యక్రమాలను నిర్ణీత తేదీల్లో నిర్వహించనున్నారు.

పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR