Nidadavole: పెరవలిలో భారీ దొంగతనం కేసు ఛేదన..40 లక్షల సొత్తు స్వాధీనం!
Nidadavole: పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురిని అరెస్ట్ చేసి రూ.40 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Nidadavole: పెరవలిలో భారీ దొంగతనం కేసు ఛేదన..40 లక్షల సొత్తు స్వాధీనం!
Nidadavole: తూర్పు గోదావరి జిల్లా పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు. అక్టోబర్ 6 వ తేదీ అర్ధరాత్రి రెండు గంటలకు పెరవలి కి చెందిన గుడివాడ సత్య శ్రీ అలియాస్ దేవుడమ్మ ఇంట్లో చోరీ. ఒంటరి మహిళ కావడంతో అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తలపై బలంగా కొట్టి సొత్తును కాజేసిన దొంగలు.
మెడలోని బంగారంతో పాటు బీరువాలోని తాకట్టు బంగారు, వెండి వస్తువులను దోచుకెళ్లిన దొంగలు. ముగ్గురు నిందితులతో పాటు మరో మహిళను అరెస్ట్ చేసి భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 40 లక్షల రూపాయల విలువ కలిగిన 357 గ్రాముల బంగారం, సుమారు 2 కేజీల వెండి వస్తువులను రికవరీ చేసిన పోలీసులు.
జూదం, పేకాట, మధ్యం వంటి వ్యసనాలకు బానిసై కటకటాల పాలైన ప్రధాన నిందితుడు జక్కంశెట్టి నాగరాజు (A-1), కడలి వెంకటరమణ (A-2) కుక్కల సాయి (A-3). ప్రధాన నిందితుడు జక్కంశెట్టి నాగరాజు...ఫై ఇప్పటికే 30 దొంగతనాల కేసులు నమోదు. జక్కం శెట్టి నాగరాజు భార్య మల్లేశ్వరి అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కేసులు చేదించిన కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ జి. దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, పెరవలి ఎస్ఐ యామన సుధాకర్, సీసీఎస్ ఎస్ఐ రవీంద్ర ల పాటు పోలీస్ కానిస్టేబుల్స్ జి అనిల్ కుమార్, అప్సర్ బేగ్, ఎం.ముత్యాలరావు, ఎన్. శ్రీనివాస్, కె. రమేష్ లను అభినందించిన జిల్లా ఎస్పీ డి.నర్సింహ కిషోర్.




