Peddapuram: పెద్దాపురంలో రహదారిపై పడిన చెట్ల తొలగింపు!

Peddapuram: కాకినాడ జిల్లా వాలు తిమ్మాపురం రోడ్డులో పడిన చెట్లను డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసులు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 28 Oct 2026 10:48 AM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో రహదారిపై పడిన చెట్ల తొలగింపు!

Peddapuram: తుఫాన్ ప్రభావంతో పెద్దాపురం ఏడీబీ రోడ్డు, వాలు తిమ్మాపురం వెళ్లే మార్గంలో చెట్లు నేలకొరిగి రహదారులకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెద్దాపురం పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

పెద్దాపురం డీఎస్పీ ఎబిజి తిలక్, సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్‌ఐ పాపారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రహదారులపై అడ్డంగా పడిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రహదారులను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

తుఫాన్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM