Chintoor: ఒక్క అవకాశం ఇవ్వండి.. ముకునూరును మార్చి చూపిస్తా: పాయం నాగరాజు

Chintoor: చింతూరు మండలం ముకునూరు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జనసేన మద్దతు సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు దూసుకుపోతూ మంచం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 27 Nov 2026 1:18 PM IST
Chintoor
X

Chintoor: ఒక్క అవకాశం ఇవ్వండి.. ముకునూరును మార్చి చూపిస్తా: పాయం నాగరాజు

Chintoor: గత దశాబ్దాలుగా ఎంతో మంది సర్పంచ్‌లను చూశారు. కానీ అభివృద్ధి అంటే ఏంటో నన్ను గెలిపిస్తే చూపిస్తా ! అంటూ జనసేన మద్దతు అభ్యర్థి పాయం నాగరాజు గర్జించారు.ముకునూరు పంచాయతీలో నాగరాజు ప్రచారం ఇప్పుడు ఓ ఉత్సవంలా మారింది. ఇంటింటికి వెళ్లి ఒక్క అవకాశం.ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ చేతులు జోడించి ఓటర్లను వేడుకుంటున్నారు. ఆయన మాటల్లో నిజాయితీ, కళ్లల్లో అభివృద్ధి కాంక్ష చూసి ఓటర్లు ఫిదా అవుతున్నారు.మంచం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.

మీ సమస్య ఏదైనా సరే.సత్వరమే పరిష్కారం చూపిస్తా అంటూ నాగరాజు ప్రతి గడపలోనూ భరోసా ఇస్తున్నారు.నాగరాజు వెంట జనసైనికులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వీధి వీధినా నాగరాజుకే మన ఓటు. మంచం గుర్తుకే మన ఓటు అనే నినాదాలతో ముకునూరు దద్దరిల్లుతోంది.యువకుడైన నాగరాజును గెలిపించాలని జనసైనికులు పట్టుదలతో పనిచేస్తున్నారు.ముకునూరులో ఇప్పుడు అందరి నోటా ఒక్కటే మాట.ఈసారి యువశక్తికే పట్టం.నాగరాజుకే మన ఓటు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR