Pithapuram: ప్రజల విజ్ఞప్తికి స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pithapuram: ప్రజల విజ్ఞప్తి మేరకు పిఠాపురం నుంచి రాజమండ్రికి ప్రత్యక్ష బస్సు సౌకర్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేయగా, ప్రారంభించారు.
Pithapuram: ప్రజల విజ్ఞప్తికి స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pithapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మరియు విద్యార్థులు పిఠాపురం నుండి రాజమండ్రి వరకు ప్రత్యక్ష బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా వినతి చేయగా, ప్రజల అవసరాన్ని వెంటనే గుర్తించిన పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి పిఠాపురం – రాజమండ్రి బస్సును శాంక్షన్ చేయించారు.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం పిఠాపురం బస్ కాంప్లెక్స్ నందు పిఠాపురం – రాజమండ్రి బస్సు ప్రారంభోత్సవ చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా వరలక్ష్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయాణికులు పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో పిజిఆర్ఎస్లో మొదటి ఫిర్యాదుకే స్పందించి బస్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, కాకినాడ డిపో మేనేజర్ జి.రమ లక్ష్మీదేవి , ఆర్టీసీ సిబ్బంది,స్టేట్ డైరెక్టర్లు, జనసేన పార్టీ నాయకులు, వార్డ్ ఇంచార్జ్‌లు, వీర మహిళలు, జనసైనికులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




