Palagummi: ప్లాస్టిక్‌కు స్వస్తి: కోనసీమ పాలగుమ్మి గ్రామస్తుల ఆదర్శం
Palagummi: పర్యావరణ పరిరక్షణ కోసం కోనసీమ జిల్లా పాలగుమ్మి గ్రామస్తులు 1,000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసి శుభకార్యాలకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలిచారు.
Palagummi: ప్లాస్టిక్‌కు స్వస్తి: కోనసీమ పాలగుమ్మి గ్రామస్తుల ఆదర్శం
పాలగుమ్మి: పర్యావరణ పరిరక్షణ, గ్రామ పరిశుభ్రత కోసం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం లోని పాలగుమ్మి గ్రామస్తులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామస్తులంతా కలిసి 1,000 స్టీల్ ప్లేట్లు, 1,000 స్టీల్ గ్లాసులను కొనుగోలు చేశారు.
గ్రామంలో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నసంతర్పణలు, అయ్యప్ప, భవానీ దీక్షల పూజలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. కార్యక్రమం అనంతరం పాత్రలను శుభ్రం చేసి తిరిగి అప్పగించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ విధానం ద్వారా పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా అరికట్టవచ్చని గ్రామ పెద్దలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాలగుమ్మి గ్రామస్తులు చేపట్టిన ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.




