Rajahmundry: నవంబర్ 5న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు.. కలెక్టర్!
Rajahmundry: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నవంబర్ 5న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన రాజమండ్రి కలెక్టర్ కీర్తి చేకూరి.
Rajahmundry: నవంబర్ 5న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు.. కలెక్టర్!
Rajahmundry: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నవంబర్ 5వ తేదీన జిల్లాలోని సంబంధిత ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం–1881, ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–1988 నిబంధనల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా సంబంధిత యాజమాన్యాలు చట్ట ప్రకారం వేతనంతో కూడిన సెలవును తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఉద్యోగులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.




