Magatapalli: నామన రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఆనంద్ సాగర్
Magatapalli: పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ మోక ఆనంద్ సాగర్ మగటపల్లిలో మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ వ్యవహారాలపై చర్చించారు.
Magatapalli: నామన రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఆనంద్ సాగర్
మగటపల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మోక ఆనంద్ సాగర్ మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నామన రాంబాబు ఆనంద్ సాగర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శేరు శ్రీనివాస్, పి.గన్నవరం మండల మాజీ ప్రధాన కార్యదర్శి గుత్తుల రామకృష్ణ, యూనిట్ ఇంచార్జ్ నిమ్మకాయల శేషు, మగటపల్లి మాజీ ఎంపీటీసీ నామన నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ సరెళ్ల సత్యనారాయణ, నామన రమేష్, నామన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




