Gondi: ఎన్నికల కోడ్ పేరుతో అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు స్థానికుల ఆగ్రహం

Gondi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో ఎన్నికల కోడ్ పేరుతో అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 19 Oct 2026 9:28 AM IST
Gondi
X

Gondi: ఎన్నికల కోడ్ పేరుతో అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు స్థానికుల ఆగ్రహం

Gondi: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహానికి పంచాయతీ సిబ్బంది ముసుగు వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి పేరుతో రాజకీయ నాయకుల విగ్రహాలతోపాటు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి సైతం ముసుగు వేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి ముసుగు వేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అధికారులు కావాలనే ఆయన విగ్రహానికి ముసుగు వేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిను వివరణ కోరగా, ఎప్పటిలాగే అన్ని విగ్రహాలతోపాటు అంబేడ్కర్‌ విగ్రహానికి కూడా ముసుగు వేశామని, వెంటనే తొలగిస్తామని తెలిపారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల నియమావళి అమలు విషయంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఆయన విగ్రహాలకు ముసుగులు వేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE