Kadiam: వాడపల్లి ఉచిత బస్సును కడియం నుంచే నడపాలి: స్థానికుల విజ్ఞప్తి

Kadiam: వాడపల్లి శ్రీవారి దర్శనార్థం నడుపుతున్న ఉచిత బస్సును కడియపులంకకు బదులుగా మండల కేంద్రమైన కడియం దేవీచౌక్ నుంచి నడపాలని ప్రజలు కోరుతున్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 3 Oct 2026 7:10 PM IST
Kadiam
X

Kadiam: వాడపల్లి ఉచిత బస్సును కడియం నుంచే నడపాలి: స్థానికుల విజ్ఞప్తి

కడియం: వాడపల్లి శ్రీవారి దర్శనానికి వెళ్లే మహిళల సౌకర్యార్థం కడియం మండలం, కడియపులంక శ్రీ ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి ప్రతి శనివారం ప్రత్యేక ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, కానీ ఈ బస్సును మండల కేంద్రమైన కడియం గ్రామం దేవీచౌక్ సెంటర్ నుంచి ఏర్పాటు చేస్తే మరింత బాగుండేదని కడియం మండల ప్రజలు కోరుతున్నారు.

దీని వలన మండలానికి చెందిన పదకొండు గ్రామాలలోని మహిళలకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా అవకాశం కలుగుతుందని, అంతేకాకుండా పురుషులు కూడా ఈ బస్సు సౌకర్యం వినియోగించుకోవడం వలన ఆర్టీసీకి ఆదాయం చేకూరుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు, స్థానిక నాయకులకు పత్రికాముఖంగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL