P Gannavaram: మాచవరంలో గ్యాస్ లీకేజ్.. అదుపులోకి తెచ్చిన సిబ్బంది!

P Gannavaram: అంబేడ్కర్ కోనసీమ మాచవరంలో ఒంగోలు గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ONGC అధికారులు వెంటనే అదుపులోకి తేగా, కలెక్టర్, ఎమ్మెల్యే స్థలాన్ని పరిశీలించారు.

RAJU, P GANNAVARAM
Published on: 30 Oct 2026 5:28 PM IST
P Gannavaram
X

P Gannavaram: మాచవరంలో గ్యాస్ లీకేజ్.. అదుపులోకి తెచ్చిన సిబ్బంది!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మాచవరంలో మరోసారి ONGC గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ఈ ఘటన స్థానిక ప్రజలను కొద్దిసేపు ఆందోళనకు గురిచేసింది. అయితే, ONGC అధికారులు వెంటనే అప్రమత్తమై సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమయ నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించడంతో పాటు, గ్యాస్ లీకేజీకి దారితీసిన కారణాలు మరియు చేపట్టిన సహాయక చర్యల గురించి ONGC అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM