Razole: రాజోలులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలు!
Razole: రాజోలులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి (MCC) అమలుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించిన ఎన్నికల అధికారులు.
Razole: రాజోలులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలు!
రాజోలు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజోలులో ఎన్నికల అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. భగవాన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే. వెంకటేశ్వరరావు, రాజోలు సీఐ సురేష్ బాబు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాలు అధికారులకు సహకరించాలని తెలిపారు.




