Odalarevu: ఓడలరేవు కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కొల్లు విష్ణుమూర్తి ఎంపిక!
Odalarevu: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు విష్ణుమూర్తి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
Odalarevu: ఓడలరేవు కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కొల్లు విష్ణుమూర్తి ఎంపిక!
ఓడలరేవు: అల్లవరం మండలం ఓడలరేవులో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఈరోజు స్థానిక శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో అందరూ కలిసి కొల్లు విష్ణుమూర్తి ని త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో కూటమి నాయకులు,కార్యకర్తలు అందరు కలసి మన గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కొల్లు విష్ణుమూర్తి పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం కూటమి నేతలు అందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థి కొల్లు విష్ణుమూర్తి శ్రీ సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి అమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది.
అనంతరం తూర్పు దిక్కున వెలసిన అమ్మ కనకదుర్గమ్మ ఆలయం వద్దకు కూటమి నేతలతో కలిసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం కొందరు ముఖ్య నేతలను కలిసి తమ మద్దతు తెలిపాలని విష్ణుమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




