Odalarevu: ఓడలరేవు ఎంపీటీసీ ప్రచారంలో నాగలక్ష్మి హోరు!

Odalarevu: కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు MPTC కూటమి అభ్యర్థి పొన్నమండ నాగలక్ష్మి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామీణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

SURESH, AMALAPURAM
Updated on: 27 Oct 2026 11:31 AM IST
Odalarevu
X

Odalarevu: ఓడలరేవు ఎంపీటీసీ ప్రచారంలో నాగలక్ష్మి హోరు!

Odalarevu: నాగలక్ష్మి కి ఓడలరేవు గ్రామ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ హారతులతో ఓరెత్తిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎంపిటిసి అభ్యర్థి నాగలక్ష్మి కొనియాడారు.

ఓడలరేవు గ్రామ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి మీ అమూల్యమైన మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి నాగలక్ష్మి అనే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తూ వేడుకుంటున్నానని నాగలక్ష్మి తెలియజేశారు.

ఓడలరేవు గ్రామస్తురాలైన నేను పొన్నమండ నాగలక్ష్మి అనే నేను మన గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై పోరాడి కూటమి ప్రభుత్వం ద్వారా ఎంపీటీసీ కోటాలో నిధులు మంజూరు చేసి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.

వీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో కొల్లు విష్ణుమూర్తి,కొల్లు త్రిమూర్తులు, కోపనాతి రామకృష్ణ,నాతి లేని బాబు,పోలమూరి వెంకటరెడ్డి,అవనిగడ్డ త్రిమూర్తులు,వాసంశెట్టి గంగాజలం తాడి ధర్మారావు, కామాడి గంగాభవాని జనసేన వీర మహిళ,రేకాడి శేషగిరి,గుబ్బల నాగేశ్వరరావు,గుండుమోను శ్రీనివాసరావు,కానుబోయిన రామ్ కుమార్,చిలకలపూడి కుమార్,వీర్ల గణేష్ కూటమి నాయకులూ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM