Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే భవనాల వినియోగం!

Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాకే భవనాలు వినియోగించాలని, అనుమతులకు విరుద్ధంగా కడితే కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 5 Nov 2026 11:23 AM IST
Rajahmundry
X

Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే భవనాల వినియోగం!

Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతనే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. గురువారం ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. శ్రీరామ్ నగర్, చౌడేశ్వర్ నగర్, గాదాలమ్మ రోడ్డు, సాయినగర్, ఆల్కాట్ గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో పలు భవనాల ప్లాన్ లను పరిశీలించారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న భవనాలు వాటి అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా కడితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.

ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ బృందం నిరంతర పరిశీలన చేపట్టి, అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించే కార్యక్రమం కొనసాగిస్తోందన్నారు. కనుక నూతనంగా నిర్మాణం చేసే భవనాలు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకొని, నిబంధనల మేరకు చేపట్టాలన్నారు.

అలాగే ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కోసం సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, వాటికి సంబంధించిన ఐపీఎల్పీలు (ఇన్-ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్స్) ఆమోద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏసీపీలు కొండలరావు, సుజాత, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY