Padamatipalem: తుపాన్ బాధితులకు ఎన్నారై చిట్టిబాబు ఆర్థిక సాయం
Padamatipalem: కోనసీమ జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో తుపాన్ వల్ల ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎన్నారై తాడి చిట్టిబాబు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు.
Padamatipalem: తుపాన్ బాధితులకు ఎన్నారై చిట్టిబాబు ఆర్థిక సాయం
పడమటిపాలెం: అర్ణబ్, మురసుల వరుస తుపాన్ ల ప్రభావంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం పడమటిపాలెం రాజీవ్ నగర్లో మంగళవారం తీవ్ర నష్టం సంభవించింది. తుపాన్ ధాటికి ఒక తాటాకు ఇల్లు పూర్తిగా కూలిపోగా, మరో మూడు తాటాకు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన ఎన్నారై, అంబేడ్కర్ వాది తాడి చిట్టిబాబు (ఇజ్రాయెల్) మానవతా దృక్పథంతో స్పందించారు. *'Payback to the Society'* కార్యక్రమంలో భాగంగా తుపాన్ బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
పూర్తిగా ఇల్లు కూలిపోయిన ఓగూరి రత్నకుమారి కుటుంబానికి రూ.20,000, పాక్షికంగా ఇళ్లు ధ్వంసమైన తాడి శ్యాంబాబు, యడ్ల రత్నం, యడ్ల మాలతీ కుమారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు తాడి నాగేశ్వరరావు, పాస్టర్ గడ్డం సీమోను, యడ్ల నర్సయ్య, యడ్ల నాగేశ్వరరావు, యడ్ల ప్రసాద్, నల్లి పెద్దిరాజు, సొసైటీ మాజీ చైర్మన్ తాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి తక్షణ ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానికులు తాడి చిట్టిబాబును అభినందించారు.




