Nidadavolu: నిడదవోలులో వైఎస్సార్‌సీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం!

Nidadavolu: నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశం ఐడీ కార్డుల పంపిణీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ధ్వజం.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 28 Sept 2026 11:00 PM IST
Nidadavolu
X

Nidadavolu: నిడదవోలులో వైఎస్సార్‌సీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం!

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ ysrcp మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు గ ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్ లో సోమవారం పట్టణ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులను కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ , జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ ,రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా , రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్ ,నియోజకవర్గ పరిశీలకులు గిరిజల బాబు, జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకత తుఫానులా మారి కూటమిని కొట్టుకుపోయేలా చేస్తుందని శ్రీనివాస్ నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ల హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు , తణుకు పరిసలికులు కొట్టు నాగు ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యలగడ బాలరాజు , మున్సిపల్ వింగ్ అధ్యక్షులు ఆకుల ముకుంద రావు , నిడదవోలు నియోజకవర్గం bc సెల్ అధ్యక్షులు యలగన పోలయ్య , మాజీ ఎంపీపీ తిరుమళ్ళ భాగ్యలక్ష్మి , నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు కట్టారి సిద్ధార్థ , జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు మానుకొండ చంద్రబాబు ,జిల్లా పార్టీ కార్యదర్శి SK చాన్ భాష , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దుర్గారావు , నియోజకవర్గం sc సెల్ అధ్యక్షులు పొట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE