Nidadavolu: ఛలో విజయవాడ ఉద్యోగులపై నిర్బంధం.. నిడదవోలులో నిరసన!
Nidadavolu: ఛలో విజయవాడ ఉద్యోగులపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ నిడదవోలులో సచివాలయ ఉద్యోగుల నిరసన జీవో 11 రద్దు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా.
Nidadavolu: ఛలో విజయవాడ ఉద్యోగులపై నిర్బంధం.. నిడదవోలులో నిరసన!
నిడదవోలు: నిడదవోలు సమస్యలు పరిష్కరించాలని ఛలో విజయవాడలో కదం తొక్కిన స్వర్ణ గ్రామ. వార్డు సచివాలయఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్భందకాండ నాయకుల అక్రమ సస్పెన్షన్లు ఖండిస్తూ సచివాలయం ఉద్యోగులు సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని నిడదవోలు ఏరియా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయఉద్యోగులసంఘం గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిన్నటి రోజున తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఛలో విజయవాడకార్యక్రమంలో చట్టబద్ధంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ ఈరోజు నిడదవోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు అక్రమ అరెస్టులు సస్పెన్షన్ లు ఎత్తి వేయాలని వెట్టి చాకిరీ నుండి విముక్తి చేయాలని. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని. నిర్దిష్ట ప్రమోషన్ ఛానల్ కల్పించాలని నష్టదాయకమైన జీవో 11రద్దు చేయాలని. సర్వేలు భారం తగ్గించాలని.
జీవో 5ప్రకారం రేష్నలైజేషన్ ప్రక్రియను పునసమీక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేస్తూ తమ అవేదన వ్యక్తం చేశారు విధి నిర్వాహణలో మరణించిన పోలీస్ అధికారికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని సానుభూతిని తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు G సన్నీ ప్రదీప్. సాగర్. దుర్గా ప్రసాద్.G కల్పన బి నాగేశ్వర రావు టి చిరంజీవి తదితరులు నాయకత్వం వహించారు.ఎపి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దిద్దే దయామణి పాల్గొని మద్దతు పలికారు.




