Ravulapalem: రావులపాలెం సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ప్రారంభం

Ravulapalem: కోనసీమ ముఖద్వారం రావులపాలెం జాతీయ రహదారి కూడలిలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన నూతన సిగ్నల్ లైట్లను ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 4 Oct 2026 3:05 PM IST
Ravulapalem
X

Ravulapalem: రావులపాలెం సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ప్రారంభం

రావులపాలెం: కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లు ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో పాటు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు.

సిగ్నల్ లైట్లు అందుబాటులోకి రావడంతో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ మరింత మెరుగుపడుతుంది. వాహనదారులు ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలుగునుంది.

రావులపాలెం కు ట్రాఫిక్ సమస్య ఈనాటిది కాదు ఎప్పటినుండో మీ సమస్యతో పోలీసులు ప్రతిరోజు ఒక సమస్యగా నిలిచిపోయింది. కోనసీమ తిరుపతిగా పేరుపొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఈ మార్గం గుండానే వెళ్ళవలసి ఉండగా మరింత ట్రాఫిక్ పెరిగింది.

దీంతో శనివారం తో పాటు ఇతరు రోజులు ట్రాఫిక్ పెను సవాల్ గా పోలీసులకు ఏర్పడుతుంది. ఈ సిగ్నల్స్ వల్ల కొంత మెరుగుపడినప్పటికీ శాశ్వత మార్గం కావాలంటే ఇక్కడ కోనసీమ ముఖద్వారంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎంతైనా అవసరం ఉందని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA