Jaggampeta: కూటమి సర్పంచ్ అభ్యర్థి పాండ్రంగి సురేఖ ఎన్నికల ప్రచారం ప్రారంభం!
Jaggampeta: జగ్గంపేటలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాండ్రంగి సురేఖ రాంబాబు రావులమ్మ అమ్మవారి దర్శనంతో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.
Jaggampeta: కూటమి సర్పంచ్ అభ్యర్థి పాండ్రంగి సురేఖ ఎన్నికల ప్రచారం ప్రారంభం!
Jaggampeta: జగ్గంపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి పాండ్రంగి సురేఖ రాంబాబు ప్రచార జోరు పెంచారు. గురువారం గ్రామ దేవత రావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భారీ సమక్షంలో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
ముందుగా ఇటీవల జగ్గంపేట జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన జీను మణిబాబుతో పాటు ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను సురేఖ రాంబాబు ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనను సర్పంచ్‌గా గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సురేఖ రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తాను ముందుండి కృషి చేశానని తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన అనంతరమే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆశీస్సులతో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానన్నారు.
కూటమి ప్రభుత్వ సహకారంతో రానున్న రెండున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామానికి తీసుకువచ్చి జగ్గంపేటను సుందరమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, కొత్త కొండబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, ఎంపీటీసీ సభ్యులు రీస్ రమణబాబు, నేదూరి గణేష్, కోడూరి సత్యనారాయణ, కింగం బాబురావు, గుండా శ్రీను తదితరులతో పాటు రాయి సాయి, వేములకొండ జోగారావు, పీల మహేష్, నాండ్ల చిరంజీవి, మారిశెట్టి గంగ,
కింగం రామకృష్ణ, గెద్దాడ సత్యవేణి, మారిశెట్టి రాధా, దుర్గపు ప్రకాష్, తోలేటి సూర్యనారాయణ, సాంబతుల చంద్రశేఖర్, ముత్యాల సత్యనారాయణ, పలివెల యేసురాజు, తుమ్మల కిషోర్, బాలాజీ రెడ్డి తదితరులు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




