Kadiyam: విజయవంతంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం!
Kadiyam: కడియం మండలంలో ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన వైద్య అధికారులు.
Kadiyam: విజయవంతంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం!
Kadiyam: కడియం మండలంలో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమం విజయవంతమైనదని కడియం మండల వైద్యాధికారులు డాక్టర్ ఎం మణిజ్యోత్స్న, డాక్టర్ ఎన్ జెస్సీ సుప్రియ లు తెలిపారు.
మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో 16410 మంది పిల్లలు ఉండగా, 16038 మందికి మాత్రలు వేసినట్లు తెలిపారు. 98 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని, ఎవరైనా వేయించుకోకపోతే మాపప్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 5వ తేదీన మిగిలిన వారికి వేయడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఎన్ ఎం లు, ఎం ఎల్ హెచ్ పి లు, సి హెచ్ ఓ లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




