Mamidikuduru: నగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్. పావని అకాల మరణం!
Mamidikuduru: కోనసీమ జిల్లా నగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్. పావని (31) అనారోగ్యంతో అకాల మరణం. వైద్యాధికారి జాన్ లెవీ, సిబ్బంది తీవ్ర సంతాపం.
Mamidikuduru: నగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్. పావని అకాల మరణం!
మామిడికుదురు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి-2 డాక్టర్ ఆర్. పావని (31) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
డాక్టర్ పావని అకాల మరణం పట్ల నగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జాన్ లెవీతో పాటు ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు




