Rajahmundry: గురువులకు ఘనంగా సన్మానం చేసిన 2007 బ్యాచ్ విద్యార్థులు!

Rajahmundry: రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండ జెడ్పీ హైస్కూల్‌లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న సంధ్యారాణి, సుజాతలను ఘనంగా సత్కరించిన పూర్వ విద్యార్థులు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 6 Oct 2026 9:45 AM IST
Rajahmundry
X

Rajahmundry: గురువులకు ఘనంగా సన్మానం చేసిన 2007 బ్యాచ్ విద్యార్థులు!

Rajahmundry: వారందరూ 2007 సంవత్సరంలో పదవ తరగతిలో, కడియం మండలం, మురమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్ధులు. తమకు చదువు నేర్పిన గురువులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు లభించినట్లు తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులను గౌరవించుకోవాలనే ఆలోచనతో అందరూ ఒక్కటయ్యారు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5, 2026 తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న, మురమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సంధ్యారాణి,

సుజాత లను కలిసి, శాలువాలు పూలమాలలు మెమెంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తూలురీ రాజు, కొప్పాక రమణ, బుష్కా రవి, గుంటూరి లక్ష్మణ్, దూది సురేష్, సీతిన శ్రీను, గుత్తుల ప్రసాద్, అడ్డాల దాసు, చెలప వెంకటస్వామి, వారణాసి నాగు, లలిత టేకి, కోమలి తదితరులు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL