Konaseema: కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ!

Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాగంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు.

RAJU, P GANNAVARAM
Published on: 3 Oct 2026 9:32 AM IST
Konaseema
X

Konaseema: కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ!

Konaseema: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అయినవిల్లి మండలం మాగం గ్రామంలోని శివాజీ నివాసానికి చేరుకున్న ఆయన, ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కారెం శివాజీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ— తమ మధ్య కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉమ్మడి నేతలపై ఉందన్నారు. విడివిడిగా ఉన్నా అన్యాయాలు జరిగినప్పుడు కలిసికట్టుగా పోరాడతామని స్పష్టం చేశారు. దళితులపై దాడులు, వివక్ష ఇప్పటికీ కొనసాగుతున్నాయని, బాబాసాహెబ్ అంబేద్కర్, ఫూలే, జగ్జీవన్ రామ్‌ల ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

కారెం శివాజీ మాట్లాడుతూ— దేశంలో దళితులందరినీ ఐక్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పార్లమెంట్‌లో దళితుల హక్కుల రిజర్వేషన్ల కాలావధిని పదేపదే పెంచే విధానం కాకుండా శాశ్వత ప్రాతిపదికన అమలయ్యేలా మందకృష్ణతో కలిసి పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM