Razole: రాజోలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో అయోమయం!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
Razole: రాజోలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో అయోమయం!
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. పురపాలక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన మార్పుల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ తేదీలపై సందిగ్ధత ఏర్పడింది.
తొలుత నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, అదే సమయంలో పురపాలక ఎన్నికల కౌంటింగ్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం రావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? లేక తేదీల్లో మార్పులు ఉంటాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రచార సామగ్రిపై ఏ తేదీలను ముద్రించాలనే విషయంలోనూ అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు. ఎన్నికల తేదీలపై స్పష్టత లేకపోవడంతో ప్రచార ఏర్పాట్లు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీలపై స్పష్టమైన సమాచారం వెల్లడించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.




