Uppalaguptam: ఎంపీపీ దంగేటి జానకి సేవలు అభినందనీయం!

Uppalaguptam: ఉప్పలగుప్తం ఎంపీపీ దంగేటి జానకి రాంబాబు ఐదేళ్ల పదవీకాలం పూర్తి సందర్భంగా అభినందన సభ. పాల్గొన్న అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 3:45 PM IST
Uppalaguptam
X

Uppalaguptam: ఎంపీపీ దంగేటి జానకి సేవలు అభినందనీయం!

Uppalaguptam: ఉప్పలగుప్తం మండలం ఎంపీపీ దంగేటి జానకి రాంబాబు ఐదేళ్ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఈరోజు ఉప్పలగుప్తం మండలానికి చెందిన నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్.

ఈ సమావేశంలో ఎంపీపీగా ఐదేళ్లపాటు దంగేటి జానకి మండల అభివృద్ధికి చేసిన కృషిని,చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేశారు.ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్మాట్లాడుతూ దంగేటి జానకి రాంబాబు దంపతులను అభినందించి, జానకి ఎంపీపీగా అందించిన సేవలకు గాను ఆమెను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు,మండల అధ్యక్షులు బద్రి బాబ్జి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM