P. Gannavaram: పీ.గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌గా మోకా ఆనంద్ సాగర్ నియామకం!

P. Gannavaram: పీ.గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌గా మోకా ఆనంద్ సాగర్ నియామకం. కార్యాలయంలో సంబరాలు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కలిసిన వైనం. పూర్తి వివరాలు.

RAJU, P GANNAVARAM
Published on: 29 Sept 2026 8:52 AM IST
P. Gannavaram
X

P. Gannavaram: పీ.గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌గా మోకా ఆనంద్ సాగర్ నియామకం!

P. Gannavaram: పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ఏడు సంవత్సరాలుగా వేచి చూస్తున్న నిరీక్షణ నేటికీ ఫలించింది. పి గన్నవరం టిడిపి ఇన్చార్జ్ గా మోకా ఆనంద్ సాగర్ ను అధిష్టానం నియమించింది.

పి గన్నవరం తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు

ఈ సందర్భంగా మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తలకు ఒక సేవకుడిగా, ఒక పాలేరుగా పనిచేస్తానని అందరినీ కలిసికట్టుగా ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు తీసుకు వెళ్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు

కానీ పి గన్నవరం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంబరాలలో అతి తక్కువ మంది కార్యకర్తలే కనిపించడం మరియు మూడు మండలాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కనిపించకపోవడం కొసమెరుపు

ఈ విధంగా రెండు మూడు వర్గాలుగా ఉన్న పి గన్నవరం తెలుగుదేశం పార్టీని ఏ మేరకు కలిసికట్టుగా తీసుకువెళ్తారో వేచి చూడాల్సిందే

ఇంచార్జ్ మోకా ఆనంద్ సాగర్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ మేం కలిసికట్టుగా పనిచేస్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం చేకూరుస్తామని అన్నారు

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM