Ambajipeta: తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే గిడ్డి అండ!
Ambajipeta: అంబాజీపేటలో తుఫాన్ పునరావాస కేంద్రాలను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి, బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు.
Ambajipeta: తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే గిడ్డి అండ!
Ambajipeta: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలంలోని తుఫాన్ ప్రభావం కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సందర్శించారు.
పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న తుఫాన్ బాధితులను ఎమ్మెల్యే పరామర్శించి, వారి సమస్యలు మరియు అక్కడ అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..




