P Gannavaram: పి.గన్నవరంలో దసరా వేడుకలు: ఎమ్మెల్యే సత్యనారాయణ పూజలు!

P Gannavaram: విజయదశమి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటికాయలవారిపాలెం వద్ద అమ్మవారిని దర్శించుకున్న పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 20 Oct 2026 2:23 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరంలో దసరా వేడుకలు: ఎమ్మెల్యే సత్యనారాయణ పూజలు!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, తాటికాయలవారిపాలెం వద్ద విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ గిడ్డి సత్యనారాయణ..

ఈ సందర్భంగా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM