Rajamahendravaram: రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు!
Rajamahendravaram: రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు. మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
Rajamahendravaram: రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు!
Rajamahendravaram: రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.




