Ainavilli: వర్షంలోనూ ఆగని ఎన్నికల ప్రచారం.. ప్రజల మధ్యే ఎమ్మెల్యే గిడ్డి

Ainavilli: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొండుకుదురులో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

RAJU, P GANNAVARAM
Published on: 3 Nov 2026 3:06 PM IST
Ainavilli
X

Ainavilli: వర్షంలోనూ ఆగని ఎన్నికల ప్రచారం.. ప్రజల మధ్యే ఎమ్మెల్యే గిడ్డి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: అయినవిల్లి మండలంలోని కొండుకుదురు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయం అవసరమని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.. వర్షం కురుస్తున్నా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలను కలుసుకుని అభ్యర్థులకు మద్దతు కోరారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM