Gannavaram: పి.గన్నవరంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ!

Gannavaram: పి.గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ. కూటమి ధర్మాన్ని పాటించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపు.

RAJU, P GANNAVARAM
Published on: 19 Oct 2026 4:56 PM IST
Gannavaram
X

Gannavaram: పి.గన్నవరంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ!

Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్త గిడ్డి సత్యనారాయణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

త్వరలోనే కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి, సీట్ల సర్దుబాటుపై చర్చించిన అనంతరం ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుని అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

కూటమి ధర్మాన్ని పాటిస్తూ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM