P Gannavaram: తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం.. ఎమ్మెల్యే గిడ్డి భరోసా

P Gannavaram: పి.గన్నవరం మండలం జీ.పెదపూడి, ఉడిమూడి గ్రామాల్లోని తుఫాన్ పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు.

RAJU, P GANNAVARAM
Published on: 29 Oct 2026 4:59 PM IST
P Gannavaram
X

P Gannavaram: తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం.. ఎమ్మెల్యే గిడ్డి భరోసా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడి, ఉడి మూడి గ్రామాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సందర్శించారు.

పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న తుఫాన్ బాధితులను ఎమ్మెల్యే పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో అందుతున్న సహాయక చర్యలు, వసతులపై ఆరా తీశారు.

బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అలాగే తుఫాన్ ప్రభావంతో రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించే పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెట్లను వెంటనే తొలగించి, రహదారులపై రాకపోకలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

తుఫాన్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM