P. Gannavaram: పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టి జనసేన విజయానికి కృషి చేస్తా..ఎమ్మెల్యే!

P. Gannavaram: అమలాపురం పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమితులైన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెడతానని ధీమా.

RAJU, P GANNAVARAM
Updated on: 11 Oct 2026 12:23 PM IST
P. Gannavaram
X

P. Gannavaram: పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టి జనసేన విజయానికి కృషి చేస్తా!

P. Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమలాపురం పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమితులైన పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ నాయకులు, జనసేన శ్రేణులు అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం పి. గన్నవరం నియోజకవర్గం నుంచి నిర్వాహక దళ్ సభ్యులుగా ఎంపికైన సభ్యులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM