Malikipuram: పడమటిపాలెం ఎన్‌ఆర్‌ఐ గ్రూప్ సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే!
Malikipuram: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెంలో ఎన్‌ఆర్‌ఐ గ్రూప్ 9వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Malikipuram: పడమటిపాలెం ఎన్‌ఆర్‌ఐ గ్రూప్ సేవలు అభినందనీయం..ఎమ్మెల్యే!
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామం శాంతినగర్ (నీటికన్నం)లోని సీయోను ప్రార్థన మందిరంలో పడమటిపాలెం NRI గ్రూప్ 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన సుమారు 100 మంది NRIలు కలిసి NGOగా ఏర్పడి గత తొమ్మిదేళ్లుగా గ్రామ ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందించడం అభినందనీయమన్నారు. స్వగ్రామంపై మమకారంతో విదేశాల్లో ఉంటూ కూడా గ్రామ అవసరాలను గుర్తించి సహాయ సహకారాలు అందిస్తున్న NRIల సేవా స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు.
ఇప్పటివరకు గ్రామంలో వివిధ అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవలకు సంబంధించి సుమారు రూ.21 లక్షల మేర సహాయం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి NRIలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ తదితర దేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధిలో NRIలు మరింత భాగస్వామ్యం కావాలని, ప్రజలు, NRIలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా NRI గ్రూప్ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో NRI గ్రూప్ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




