Sakinetipalli: ONGC నిధులతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన
Sakinetipalli: సఖినేటిపల్లి మండలంలో రూ.1.5 కోట్లతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి నీటిని అందిస్తామన్నారు.
Sakinetipalli: ONGC నిధులతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన
సఖినేటిపల్లి: మండలం లోని పలు గ్రామాల్లో ONGC–CSR నిధులతో చేపట్టనున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలోని కోనవారి గ్రూపులో రూ.27 లక్షల ONGC–CSR నిధులతో 30 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రామేశ్వరం గ్రామంలోని చర్చి పేటలో రూ.28 లక్షలతో 30 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణానికి, శృంగవరప్పాడు గ్రామంలోని చెల్లుబోయినవారి గ్రూపులో రూ.25 లక్షలతో 30 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఈ వారంలో మొత్తం ఐదు మంచినీటి ట్యాంకుల (OHSR) నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని, సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ ట్యాంకుల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
గత రెండేళ్లుగా రాజోలు నియోజకవర్గంలో 100 కొత్త మంచినీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న 150 పాత మంచినీటి ట్యాంకులకు అదనంగా కొత్తగా నిర్మిస్తున్న 100 ట్యాంకులు అందుబాటులోకి వస్తే మొత్తం 250 మంచినీటి ట్యాంకులు ప్రజలకు సేవలందిస్తాయని తెలిపారు.
గ్రామాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వేసవికాలంలో కూడా ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి ప్రతిరోజూ మంచినీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా, గ్రామాల వారీగా అవసరాలను గుర్తించి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ONGC–CSR నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు.




