Razole: చెన్నడంలో ₹13 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం: ఎమ్మెల్యే వరప్రసాద్

Razole: రాజోలు మండలం చెన్నడంలో రూ.13 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించి, మంచినీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 5 Oct 2026 5:09 PM IST
Razole
X

Razole: చెన్నడంలో ₹13 లక్షల సీసీ రోడ్లు ప్రారంభం: ఎమ్మెల్యే వరప్రసాద్

రాజోలు: రాజోలు మండలం చెన్నడం గ్రామంలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వెల్లడించిన సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించి, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ స్తంభాలకు కొత్త వైర్లు ఏర్పాటు చేసి లో-వోల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని, పోలేరమ్మ తల్లి చెట్టు ప్రాంతానికి విద్యుత్ సరఫరా కల్పిస్తామని చెప్పారు.

అలాగే గ్రామానికి అవసరమైన ఆర్‌అండ్‌బీ, సీసీ, గ్రావెల్ రోడ్ల పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE