Gopalapuram: గోపాలపురంలో రూ.1.62 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం!
Gopalapuram: కొత్తపేటలో గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి.. గోపాలపురంలో రూ.1.62 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.
Gopalapuram: గోపాలపురంలో రూ.1.62 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం!
Gopalapuram: గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం గోపాలపురంలో రూ.90 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు కమ్ డ్రైన్లను ఆయన మరియు ఆకుల రామకృష్ణ కలిసి ప్రారంభించారు.
రూ.72 లక్షలతో నిర్మించిన రెండు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒకేరోజు గోపాలపురంలో రూ.1.62 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో గ్రామీణులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.
బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగులతో పాటు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆరోగ్య కేంద్రాల సేవలతో అత్యధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామాల్లో మంచి రవాణా సౌకర్యాలు ఏర్పడితేనే పరిశుభ్రత మెరుగవుతుందని, తద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.




