Kothapeta: వెలిచేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు!
Kothapeta: కొత్తపేట మండలం వెలిచేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రజల నుంచి 86 వినతులు స్వీకరణ, సమస్యల తక్షణ పరిష్కారం.
Kothapeta: వెలిచేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు!
Kothapeta: ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకు పాలన చేరువవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో ఆదివారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 86 వినతులు అందాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లో భాగంగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని తెలిపారు. అప్పటికప్పుడే పలు సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.




