Amalapuram: రూ.6.80 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం.. ఎమ్మెల్యే!
Amalapuram: అమలాపురం నియోజకవర్గంలో రూ. 6.80 కోట్లతో వివిధ అభివృద్ధి, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.
Amalapuram: రూ.6.80 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం.. ఎమ్మెల్యే!
Amalapuram: రూ.5 కోట్ల 5 లక్షలతో సన్నవిల్లిలో బి.టి.రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు.గ్రామీణ రహదారులకు మహర్దశ హర్షం వ్యక్తం చేసిన ప్రజలలు.అమలాపురం నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 6.80 కోట్ల (సుమారు రూ. 7 కోట్లు) అంచనా వ్యయంతో 7 ప్రధాన రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయడంలో భాగంగా,ఈరోజు ఉప్పలగుప్తం మండలంలోని సన్నవిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆనందరావు ఘనంగా శ్రీకారం చుట్టారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానంగా ఉప్పలగుప్తం మండల పరిధిలోని కీలక రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.రూ. 2.75 కోట్ల వ్యయంతో SM రోడ్డు 11/9 నుండి అమలాపురం చల్లపల్లి R&B రోడ్డు (7/95) వరకు 3.60 కిలోమీటర్ల పొడవునా బి.టి. రోడ్డు నిర్మాణం.భీమనపల్లి నుండి కిత్తనచేరువు వరకు
రూ. 2.30 కోట్ల వ్యయంతో SM రోడ్డు 11/9 నుండి పల్లంకుర్రు R&B రోడ్డు (0/31) వరకు సన్నవిల్లి మీదుగా 3.00 కిలోమీటర్ల పొడవునా బి.టి. రోడ్డు నిర్మాణం.సన్నవిల్లి, చిన్నగడావిల్లి,పెద్దగడావిల్లి, గ్రామల మీదుగా ఉప్పూడి వరకు ఏ నిర్మాణాలు జరుగుతాయని ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ 2014-2019 మధ్యకాలంలో తమ టిడిపి హయాంలోనే ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత వచ్చిన గత వైకాపా ప్రభుత్వం మరియు నాటి పాలకులు ప్రజల కష్టాలను,రహదారుల దుస్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.గత పాలకుల అలసత్వం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నాటి మంత్రి సైతం ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ప్రజల రవాణా కష్టాలను గుర్తించి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో,డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఈ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.సన్నవిల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు రహదారుల నిర్మాణంతో తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అభివృద్ధిని చూసి ఓర్వలేక, రాబోయే రోజుల్లో తమకు గెలుపు లేదని తెలుసుకుని, వైకాపా నాయకులు "సాక్షి" ఛానెల్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు సన్నవిల్లి గ్రామ ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




