Amalapuram: అమలాపురంలో రూ. 1.32 కోట్ల పనులకు శంకుస్థాపన

Amalapuram: పట్టణంలో రూ. 1.32 కోట్ల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు మరియు పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శంకుస్థాపన చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 18 Sept 2026 11:41 AM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో రూ. 1.32 కోట్ల పనులకు శంకుస్థాపన

Amalapuram: వార్డులలో సీసీ రోడ్లు,డ్రెయిన్ పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టినా ఎమ్మెల్యే ఆనంద రావు.అమలాపురం పురపాలక సంఘ పరిధిలోని వివిధ వార్డులలో అభివృద్ధి పనుల్లో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులు,ఎన్.సి. సబ్ ప్లాన్ నిధులతో మొత్తం ₹1,32,94,494 (రూ. 1.32 కోట్లకు పైగా) అంచనా వ్యయంతో చేపడుతున్న పలు సిసి రోడ్లు, డ్రెయిన్లు మరియు పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆనందరావు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1వ వార్డు కిమ్స్ రోడ్డు వద్ద ₹10.00 లక్షల నిధులతో ఆర్.సి.సి. డ్రెయిన్ నిర్మాణానికి, 10వ వార్డు కిమ్స్ విత్తనాల వారి వీధిలో ₹12,94,494 తో ఆర్.సి.సి. డ్రెయిన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.అలాగే 14వ వార్డు అంబేద్కర్ విగ్రహం వద్ద ₹10.00 లక్షల నిధులతో చేపట్టిన హెచ్‌డిపిఈ పైప్‌లైన్ పనులకు,21వ వార్డు కురసాలవారి వీధి జంక్షన్ వద్ద ₹40.00 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.

వీటితో పాటు 17 మరియు 21వ వార్డుల పరిధిలో రామాలయం వద్ద ₹60.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,అమలాపురం పట్టణ రూపురేఖలు మార్చి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.

పట్టణంలోని ప్రతి వార్డులో డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని,పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు,పురపాలక సంఘ అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM