Amalapuram: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందరావు!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

SURESH, AMALAPURAM
Published on: 1 Nov 2026 10:51 AM IST
Amalapuram
X

Amalapuram: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందరావు!

Amalapuram: అమలాపురం పట్టణ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.

పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి,ఓటింగ్ సరళిని ప్రశాంతమైన వాతావరణంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఉత్సాహాన్ని,క్యూలైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టణ ప్రజలకు అభినందనలు తెలిపారు.

అమలాపురం లో ప్రశాంత వాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM