Samanasa: సమనసలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు!
Samanasa: అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.
Samanasa: సమనసలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు!
Samanasa: అమలాపురం రూరల్ మండలం, సమనస గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ఆనందరావు ఈ రోజు స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడ్డ సమనస గ్రామ ప్రజల కష్టాలకు నేటితో పరిష్కారం లభించిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని త్రాగునీటి ఎద్దడి లేకుండా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆర్డబ్ల్యూఎస్ (RWS) అధికారులు మరియు గ్రామస్థులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




